Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.

06-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయాత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరారు. శనివారం బీఆర్ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాలనీలో అంతర్గత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, కాలనీల మధ్య విద్యుత్ లైన్ పోల్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.

Article Image

హయాత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరారు. శనివారం బీఆర్ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాలనీలో అంతర్గత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, కాలనీల మధ్య విద్యుత్ లైన్ పోల్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News