Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

06-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నారు.

ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 56 మంది లబ్ధిదారులకు రూ.18,04,242 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యలను అధిగమించాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం అవసరమైన వారికి ముందస్తుగా ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

గత 23 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News