Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 01:22 PM

99 రోజుల ప్రజాపాలనపై విస్తృత అవగాహన. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీడీవో రాములు.

06-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రామన్నపేట మండలంలోని నీర్నేముల, శోభనాద్రిపురం, లక్ష్మాపురం, కొత్తగూడెం, నిదానపల్లి, ఇంద్రపాలనగరం గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఎ. రాములు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటల సాగుపై సూచనలు అందించారు. తహసీల్దార్ లాల్‌బహదూర్, ఆర్‌ఐ శోభ జనాభా గణన ప్రాధాన్యాన్ని వివరించి ప్రజలు సరైన సమాచారం అందించాలని కోరారు. పోలీసు శాఖ అధికారులు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్ వినియోగం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

హౌసింగ్ శాఖ అధికారులు గ్రామాల్లో మంజూరైన గృహాల నిర్మాణ పురోగతిని వివరించారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్లు, పూర్తయిన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న గృహాల వివరాలను ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.డి. రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అజాజ్ అలీ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాఘవ, హౌసింగ్ ఏఈ సురేష్, ఆర్‌ఐ శోభ, ఈజీఎస్ ఏపీఓ పి. వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు సుమన్, ఎన్. విఠల్‌కుమార్, జీపీఓలు లక్ష్మి, అనిత, ఈజీఎస్ ఎఫ్‌ఏ చంద్రయ్య, అంగన్‌వాడీ టీచర్లు బబ్బురి నాగమ్మ, కౌసల్య, పవిత్రవాణి, ఎంఎల్‌హెచ్‌పీలు బేబీ, ఆదిలక్ష్మి, షాలిని, ఆశా కార్యకర్తలు గంగాపురం మాధవి, లక్ష్మమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

99 రోజుల ప్రజాపాలనపై విస్తృత అవగాహన. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీడీవో రాములు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News