Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 01:27 PM

50 వసంతాలు పూర్తి చేసుకున్న రమేష్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్.

06-06-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

ఒక వ్యాపారం సుదీర్ఘకాలం కొనసాగుతుంది అంటే ఆ వ్యాపార సంస్థ పైన, ఆ వ్యాపార నిర్వాహకుల పైన ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం. మన్నికైనా, నాణ్యత కలిగిన వస్తువుల విక్రయం, మర్యాద, వినియోగదారుల పట్ల వినమ్రత, గౌరవించడం తదితర అంశాలు వ్యాపారం నిరంతరం కొనసాగడానికి దీర్ఘకాలంగా నిలబడి ఉండడానికి కారణమని చెప్పక తప్పదు. రామన్నపేటలో 50 ఏళ్లకు పైగా సాగుతున్న వ్యాపార సంస్థలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి రామన్నపేటలో 50 వసంతాలుగా కొనసాగుతున్న రమేష్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్. 7-6-1976 సంవత్సరంలో మండల కేంద్రంలోని పాత చాపల మార్కెట్ వద్ద స్థాపించారు. నాటినుండి నిరంతరాయంగా కొనసాగుతూ ఈ ప్రాంత ప్రజల మనలను పొందుతుంది. నాణ్యమైన, నాణ్యత కలిగిన మందులను అందించడానికి రాజీపడకుండా ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో ప్రామాణికంగా అర్థ శతాబ్ద కాలం నుండి కొనసాగుతూనే ఉంది.

వ్యాపారంతో పాటు సేవలు.

స్థానిక రమేష్ మెడికల్ హాల్ నిజాయితీగా మెడికల్ షాప్ నడుపుతూ వ్యాపారం చేయడం కాకుండా నిరుపేదలకు సైతం ఓటిసి ప్రొడక్ట్స్ ను అతితక్కువ ధరలకు అందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు తోడుపాటున అందిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ నిర్వాహకులు, ఫార్మసిస్ట్ రాపోలు రమేష్ మాట్లాడుతూ వ్యాపారంగా కాకుండా సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. అనేక రక్తదాన శిబిరాలకు, వైద్యశిబిరాల నిర్వహణలో చేయూతనందించడమే గాక ఉద్యమకారుల జనజీవన స్రవంతిలో ఉచిత మందులను సైతం అందించాం. ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ చట్టాలకు అనుగుణంగా వ్యాపార నిర్వహణ చేస్తూ అధికారుల మన్ననలను ఉందేమన్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా ప్రజలకు సేవలందించిన సందర్బం మరువరానిదన్నారు. ప్రభుత్వ నిర్వహణ కార్యక్రమాలైన యాంటి టిబి ప్రోగ్రాం అవేర్నెస్, ఏఎన్ఆర్(యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్) ప్రోగ్రాం, మత్తు రహిత సమాజ నిర్మాణంలో చురుకుగా పాల్గొని మా వంతు పాత్రను పోషిస్తూ నిరంతరం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నేటి వరకు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుందామన్నారు.

కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ స్థాపనలో కీలకపాత్ర

రామన్నపేట మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ స్థాపించడంలో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా సుధీర్ఘకాలం అసోసియేషన్ అధ్యక్షులుగా రాపోలు రమేశ్ కొనసాగుతున్న అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. గతంలో ఏఐఓసిడి ద్వారా జరిగిన మందులపై లోకల్ టాక్స్ ఎక్స్ట్రా అన్న నిబంధన వ్యతిరేక ఉద్యమించామని, ఇన్క్లుసీవ్ ఆల్ టాక్సెస్ అని రావాలని, ఆన్లైన్ ద్వారా మందుల సరఫరాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Sthanikam

50 వసంతాలు పూర్తి చేసుకున్న రమేష్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News