Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి

06-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని, ఈ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి పి. సుసింధర్‌రావుకు డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, యూనిఫాంలు, షూస్ తదితర వస్తువులను కూడా విద్యాసంస్థల ద్వారానే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన ప్రతిసారి తల్లిదండ్రులు లక్షల రూపాయల భారం మోస్తూ అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు.

విద్యను సేవా రంగంగా కాకుండా వ్యాపారంగా మార్చి లాభాపేక్షతో వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు ఎండీ బేగ్, అమనగంటి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News