Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ

06-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వర్షాకాల సన్నద్ధత, హరితహారం, విద్యుత్ సమస్యలపై విస్తృత చర్చ

చిట్యాల మండలం ఆరెగూడెం

గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, హరితహారం కార్యక్రమం, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులకు వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే వర్షపు నీటిని సంరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించి, పరిష్కార చర్యలపై చర్చించారు.

కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఎంపీవో అనుముల కోటేష్, సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ జుంజి రాజు, గ్రామ కార్యదర్శి శారద, వార్డు సభ్యులు రాచమల్ల మహేష్, అనిత, లడే అనిత, నందిపాటి శ్రీను, సప్పిడి విజయలక్ష్మి, గ్రామ జీపీఏ రాణి, విద్యుత్ లైన్‌మన్ నరసింహ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సభ అనంతరం ఎంపీవో కోటేష్, సర్పంచ్ శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Sthanikam

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News