Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

కలిసికట్టుగా పనిచేస్తేనే వార్డుల అభివృద్ధి

06-06-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* చౌటుప్పల్ 9వ వార్డు సభలో మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

* అన్యోన్య దాంపత్యానికి ‘సీడీఈడబ్ల్యూ’ కౌన్సెలింగ్ బాటలు

ప్రజలందరూ కలిసికట్టుగా భాగస్వామ్యులై పనిచేసినప్పుడే వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..​ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభలు జూన్ 10వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని చైర్‌పర్సన్ వివరించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి, ప్రగతి సాధనకు ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని కోరారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న 'మహిళా అభివృద్ధి, సాధికారిక కేంద్రాలు' అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న కౌన్సెలింగ్ ఎన్నో కుటుంబాలలో విభేదాలను తొలగించి, అన్యోన్య దాంపత్యానికి బాటలు వేస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.ఈ సభలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్, స్థానిక షీ టీమ్ అధికారులు, వార్డు ప్రతినిధులు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

కలిసికట్టుగా పనిచేస్తేనే వార్డుల అభివృద్ధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News