Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:19 PM

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ

06-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మరో 210 మంది బాలబాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేయగా, ప్రతి చిన్నారికి స్వయంగా సైకిల్ అందించి అభినందించారు.గత వారం టోకెన్లు పొందిన వారికి ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్న జగ్గారెడ్డి, ఇంకా సైకిళ్లు అందని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ దశలవారీగా సైకిళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. టోకెన్లు లేని చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి తదుపరి విడతలో వారికి కూడా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News