Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 02:21 PM

నల్గొండ వైద్యాఆరోగ్య శాఖలో ‘బదిలీల’ భాగోతం!

06-06-2026 649 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నిబంధనలు తుంగలో తొక్కి అటెండర్ల కౌన్సిలింగ్..

హాలియా పీహెచ్‌సీకి అటెండర్ కరవు, మునుగోడులో ఇష్టారాజ్యం..

డి.ఎం.హెచ్.ఓ బదిలీ సాకు తో వసూళ్లు..‘లక్షలాది’ రూపాయలు చేతులు మారిన వైనం అంతా ‘డీఎంహెచ్‌ఓ’ కనుసన్నల్లోనేనా?

నల్గొండ ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయం అక్రమాలకు, పైరవీలకు అడ్డాగా మారింది. ఈ నెల 25వ తేదీన నిర్వహించిన నాలుగో తరగతి సిబ్బంది (అటెండర్ల) బదిలీల కౌన్సిలింగ్ తీవ్ర అస్తవ్యస్తంగా సాగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 40 శాతం మించకుండా బదిలీలు చేపట్టాల్సి ఉండగా.. ఇక్కడి అధికారులు ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. అవసరం లేకున్నా బదిలీలు చేయడం, అర్హులను పక్కన పెట్టడం వెనుక లక్షలాది రూపాయల చేతులు మారినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నల్గొండ టూ మునుగోడు 50 వేల నజరానా..

బదిలీల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో జరిగిన వ్యవహారమే నిదర్శనం.

మునుగోడు పీహెచ్‌సీలో పనిచేస్తున్న అటెండర్‌ను వాస్తవానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.

కానీ, ఒక పథకం ప్రకారం అతన్ని చండూరుకు బదిలీ చేశారు. ఆ స్థానంలో నల్గొండలో పనిచేస్తున్న మరొకరిని మునుగోడుకు తీసుకొచ్చారు. ఈ అడ్డగోలు బదిలీ కోసం సదరు అటెండర్ నుంచి ఒక ఉన్నతాధికారి ఏకంగా రూ. 50,000 వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రిటైర్డ్ ఉద్యోగి స్థానంలో ఓ అటెండర్ కోసం ‘సూపరింటెండెంట్’ ఆరాటం..

మునుగోడుకు బదిలీపై వెళ్లిన అటెండర్‌ను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గతంలో పనిచేసి, కొన్ని రోజుల క్రితమే పదవీ విరమణ పొందిన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడి స్థానంలో కూర్చోబెట్టడానికి ఓ సూపరింటెండెంట్ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఇందుకోసం ఆగమేఘాల మీద పావులు కదుపుతూ, ఫైళ్లను గాల్లోనే కదిలిస్తున్నట్లు కార్యాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిధుల వేట బాధితుల గుండె కోత..

వైద్య ఆరోగ్య శాఖలో ఏ చిన్న పోస్టు మార్పు కావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా రేట్ల పట్టికలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఆశ చూపి..ఒక మహిళా అటెండర్‌ను ‘ఎల్డీ కంప్యూటర్’ పోస్టులోకి మారుస్తానంటూ నమ్మబలికిన ఓ అధికారి ఆమె వద్ద నుంచి 1,50,000 (లక్షన్నర రూపాయలు) వసూలు చేశారు. తీరా కౌన్సిలింగ్ ముగిశాక ఆమెకు ఎలాంటి ఆర్డర్ రాకపోవడంతో సదరు మహిళా ఉద్యోగి లబోదిబోమంటున్నారు.

ఎల్డి కంప్యూటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తానని మోసం..

డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తామంటూ మరొకరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఉద్యోగమూ రాలేదు.. పోస్టూ రాలేదు. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే.. సదరు అధికారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. బాధితుల సొమ్ము ‘గోవిందా’ మాయమేనా అని ఉద్యోగులు వాపోతున్నారు.

హాలియాకు అటెండర్ కరవు..డీఎంహెచ్‌ఓ బదిలీ సాకుతో వసూళ్లు!

ఒకవైపు అవసరం లేని చోట బదిలీలు చేస్తూ నిధులు దండుకుంటున్న అధికారులు, అత్యంత కీలకమైన హాలియా పీహెచ్‌సీని మాత్రం అటెండర్ లేకుండా ఖాళీగా పెట్టారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలకమైన పీహెచ్‌సీలను ఇలా గాలికొదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

మరోవైపు, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) త్వరలోనే బదిలీపై వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అదనుగా భావించిన సదరు అధికారి ‘అనుచర గణం’ వసూళ్ల పర్వానికి తెరలేపిందని సమాచారం. "సార్ ఎలాగో వెళ్ళిపోతున్నారు.. ఇప్పుడే పని ముగించుకోవాలి" అంటూ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

‘బాస్’కు తెలిసే జరుగుతోందా?

ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? లేక ఆయన అండదండలతోనే ఈ దందా సాగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో జరుగుతున్న ప్రతి అక్రమానికి ‘కర్మ, కర్త, క్రియ’ అన్నీ 'డీఎంహెచ్‌ఓ' అనుచర గణమే అంటూ బాహాటంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితేనే బదిలీల వెనుక ఉన్న అసలు ‘తిమింగలం’ బయటపడతాయని బాధితులు కోరుతున్నారు.

Sthanikam

నల్గొండ వైద్యాఆరోగ్య శాఖలో ‘బదిలీల’ భాగోతం!

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News