Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:59 AM

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి
26-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పదకొండు అంకెల సంఖ్యతోనే పథకాల లబ్ధి – గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూభారతి ద్వారంలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ నమోదు చేసుకోవాలని గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గాంధీనగర్‌లో ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఫార్మర్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక సంఖ్య జారీ అవుతుందని, ఆ సంఖ్య ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వం అందించే అన్ని పథకాల లబ్ధి కలుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం వర్తించాలన్నా ఫార్మర్ నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. పంట నష్టం పరిహారం, పంట భద్రత తదితర ప్రయోజనాలకు కూడా ఈ నమోదు అవసరమని చెప్పారు. నమోదు కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకుని రావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా వెంటనే నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చి రాములు, కస్పరాజు రమేష్, సతీష్, రషీద్, వార్డు అధికారి నరేష్, సల్మాన్, అశోక్, గంగరాజు, రవి, భాస్కర్, జానయ్య, ప్రభు, ఉప్పి, ఉపేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News