Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:07 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి

06-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులో గల రైతు వేదికలో జుక్కల్ క్లస్టర్ పరిధిలో మే 04 నుండి మే 09 వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాలను ఘనంగా ప్రారంభించిన ఆయన, ఈ సందర్భంగా నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు”లో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రవేత్తల సూచనలు పాటించి ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి సాగు మెళకువలు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు.విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వం రైతులకు వెన్నంటి ఉంటుందని, రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాయిల్ టెస్ట్ ల్యాబ్ మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు, యాంత్రీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వివరించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News