Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి

26-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలో రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్‌లోనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.

అలాగే పెండింగ్ బోనస్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని, ఫామాయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News