Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్‌తో బర్రె మృతి

03-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ మండలంలోని పోసానిపేట గ్రామంలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని మంజీరా నది అంచున ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ వద్ద విద్యుత్ లీకేజీ కారణంగా కరెంట్ షాక్ తగిలి నాయికోటి నగేష్‌కు చెందిన సుమారు రూ.80 వేల విలువైన బర్రె మృతి చెందింది. ప్రతిరోజులాగే బర్రెలను నీళ్లు తాగించేందుకు మంజీరా నది వద్దకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడు బర్రెలు నీటిలోకి దిగగా కరెంట్ వ్యాపించడంతో రెండు బర్రెలు బయటపడగా ఒకటి అక్కడికక్కడే మృతి చెందింది. పాలు అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్న నగేష్ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ గోపాల్, ఉపసర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గ్రామంలో విషాద వాతావరణం నెలకొల్పింది.

Sthanikam

రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్‌తో బర్రె మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News