Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

రైతన్నకు భరోసా… చాట్రాయిలో గ్రామాలన్నింటికీ “రైతన్న మీకోసం” దూసుకెళ్తున్న కార్యక్రమం

18-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, : రైతన్నను రాజుగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమం చాట్రాయి మండలంలో ఊపందుకుంది. గ్రామాలన్నింటికీ చేరువగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

వ్యవసాయం కేవలం జీవనాధారం కాకుండా లాభదాయకమైన గౌరవప్రదమైన రంగంగా మారాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం సుమారు 35 శాతం వాటాతో కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు.

“స్వర్ణాంధ్ర 2047” లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతి ఏడాది కనీసం 15 శాతం వృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఐదు ప్రధాన దిశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. సాగునీటి వనరుల విస్తరణ, భూగర్భ జలాల సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహంతో నీటి భద్రత కల్పించడం… దేశ, విదేశాల్లో డిమాండ్ ఉన్న కొబ్బరి, కాఫీ, కోకో, ఆయిల్ పామ్ పంటల సాగుకు ప్రోత్సాహం… అగ్రిటెక్ ద్వారా రైతు ముంగిట డిజిటల్ సేవలు, చీడపీడలను గుర్తించే AI యాప్స్ వినియోగం… ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ జోడించడం… ఇలా పలు దిశల్లో చర్యలు వేగవంతం చేశారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కే. హబీబ్ భాష రైతులతో నేరుగా మాట్లాడి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది గ్రామాల వారీగా తిరిగి “రైతన్న మీకోసం” కరపత్రాలను రైతుల ఇళ్ల వద్ద అందజేశారు.

మండల వ్యవసాయ అధికారి బి.శివశంకర్ మాట్లాడుతూ, “రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. రైతన్నలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.

Sthanikam

రైతన్నకు భరోసా… చాట్రాయిలో గ్రామాలన్నింటికీ “రైతన్న మీకోసం” దూసుకెళ్తున్న కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News