Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

‘రైతన్న మీకోసం’లో రైతులకు పథకాలు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

23-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలోని సాదాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను రైతులకు వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సరఫరా విధానాలపై సమగ్ర సమాచారం అందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా భాయ్, రంగస్వామి నాయుడు, ఎల్‌ఎల్‌సి చైర్మన్ రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, రంగన్న, జిందే శంకర్, బాబు నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజి, అయ్యన్న, గిడ్డయ్య, జేసీ బంగారయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘రైతన్న మీకోసం’లో రైతులకు పథకాలు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News