Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:45 PM

రాహుల్ బంధు పథకంపై కేటీఆర్ విమర్శలు

రాహుల్ బంధు పథకంపై కేటీఆర్ విమర్శలు

రాహుల్ బంధు పథకంపై కేటీఆర్ విమర్శలు
March 09, 2026 05:57 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిరిసిల్లలో జరిగిన కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులను ఈ పథకానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నాలుగు సార్లు నిధులను ఇవ్వకుండా ఎగ్గొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన నిధులను పక్కనపెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాహుల్ గాంధీ కుటుంబానికి అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ రైతుల సొమ్మును పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను గుర్తు చేస్తూ, వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News