Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

రబీ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

24-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం అదే రోజున కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లర్లు కూడా లోడింగ్ అయిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా స్వీకరించాలని స్పష్టం చేశారు.

అలాగే ప్రతి కొనుగోలు కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ధాన్యం నిల్వకు అవసరమైన టార్పాలిన్లు, తూర్పార పట్టే యంత్రాలు, గన్నీ సంచులు, వెయింగ్ మెషీన్లు వంటి పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం రవాణా కోసం తగిన సంఖ్యలో లారీలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణ రెడ్డి, జిల్లా తూనిక కొలతల అధికారి వెంకటేష్, జిల్లా కోఆపరేటివ్ అధికారి మురళి, మిల్లర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రబీ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News