Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:40 AM

“పులి బక్కపడినా చారలు పోవు… తెలంగాణ కోసం పోరాటం ఆగదు” జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్

20-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శామీర్‌పేట్: జన్మదిన వేడుకల సందర్భంగా తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ భావోద్వేగంగా మాట్లాడారు. “ఎన్నో దెబ్బలు తగిలాయి.. అనేక గాయాలు అయ్యాయి. అయినా పులి బక్కపడినంత మాత్రాన పులి చారలు పోవు” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చిందించి, పోరాడి సాధించుకున్నామని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాను. మాకు శక్తి ఇచ్చేది ప్రజలే” అని స్పష్టం చేశారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిమంది తనను కలవడం ఆనందంగా ఉందని ఈటల చెప్పారు. “పార్టీలు, సిద్ధాంతాలు వేరు అయినా సమాజ హితం కోరుకునే వారు నా వద్దకు రావడం గర్వకారణం. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మానవత్వంతో ప్రజలు కలిసివచ్చారు” అని అన్నారు.

నాయకుడికి గౌరవం, బాధ్యత ఉండాలని, తన హోదాకు తగిన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “ప్రతి విషయానికి వెంటనే స్పందించకపోయినా.. పరిష్కారం కోసం ఆలోచన మాత్రం కొనసాగుతుంది” అని చెప్పారు.

తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ, ఉప్పల్ రైల్వే ట్రాక్‌లపై జరిగిన ఘటనలు, మానుకోటలో జరిగిన పోరాటాలను ప్రస్తావించారు. “మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టే. మేము ఒకరి మేలు కోరేవాళ్లం తప్ప కీడు కోరేవాళ్లం కాదు” అని స్పష్టం చేశారు.

ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ, “డబ్బులతో వార్తలు మేనేజ్ చేయవచ్చు కానీ అంతిమ విజయం ధర్మానిదే” అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీ కోసం కాదని, ప్రజల కోసం సాధించుకున్నదని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారిపై ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారని, ఇప్పటికే ప్రజలు అవగాహన పెంచుకున్నారని చెప్పారు.

“పదవుల కోసం విలువలు వదులుకునే వాళ్లం కాదు. ప్రలోభాలకు లొంగే వాళ్లం కాదు. ప్రజల పక్షాన, ధర్మం – న్యాయం పక్షాన నిలబడతాం” అని హామీ ఇచ్చారు.

Sthanikam

“పులి బక్కపడినా చారలు పోవు… తెలంగాణ కోసం పోరాటం ఆగదు” జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News