Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే మాఘ అమావాస్య వేడుకలు బోరంచలో సిద్ధం

16-01-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం మళ్ళీ భక్తుల సందర్శనలకు సన్నద్ధమవుతోంది. మంజీరా నది ఒడ్డున ఉన్న అతి పురాతన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రజలను ఆహ్వానిస్తోంది.దేవాలయ నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు, 18వ తారీఖు ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా, శ్రీ సంగమేశ్వర దేవాలయం సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకం,హోమం,మరియు మంజీరా నదిలో గంగా స్నానాలు నిర్వహించబడతాయి.ఈ కార్య‌క్ర‌మానికి ముందు, 17వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మంజీరా నది వద్ద గంగాహారతి ప్రారంభమై, రాత్రి భక్తుల కోసం బోరంచ చుట్టుపక్కల గ్రామాల భుజం కళాకారులతో భజన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం రాత్రి నుండి ఉదయానికి వరకు కొనసాగుతూ, భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందిస్తుంది.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవ్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖరరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హాజరై, ప్రత్యేక పూజలో పాల్గొంటున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేవాలయ నిర్వాహకులు, నారాయణఖేడ్ ప్రాంతీయ ప్రజలు అధిక సంఖ్యలో గంగా స్నానాలు కార్యక్రమంలో పాల్గొని, పండుగను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాంతరంలో, భక్తుల కోసం అన్నదానం కూడా నిర్వహించబడనుంది.స్థానికులు పేర్కొన్నట్లు, ఈ మాఘ అమావాస్య వేడుక బోరంచ గ్రామానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని, సంప్రదాయానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది.

Sthanikam

ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే మాఘ అమావాస్య వేడుకలు బోరంచలో సిద్ధం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News