Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

25-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పోచంపల్లి చేనేతను ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని చేనేత వస్త్ర వ్యాపారం మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

బుధవారం పోచంపల్లి మండల కేంద్రంలో టూరిజం పార్క్, చేనేత వృత్తిదారుల ఇళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. పోచంపల్లి చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి టూరిజం దృష్ట్యా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

అనంతరం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్, ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సంక్షేమం, సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం, చేనేత రంగాలు పరస్పరం అనుసంధానమై అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మార్కెటింగ్ సదుపాయాలను విస్తరించి పోచంపల్లిని ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

తదుపరి జాలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేత రంగానికి అనుగుణంగా కొత్త డిజైన్ల రూపకల్పనకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జలాల్‌పూర్ గ్రామంలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్, లేక్ వ్యూ పార్క్‌లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ ఏడి ఎ.శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News