Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు

09-03-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ యజమాని పెట్టిన బోర్డు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డులో “ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే 441 సెక్షన్ కింద చర్యలు.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో ఫంక్షన్ హాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండానే కొంతమంది వచ్చి భోజనం చేసి వెళ్లిపోతున్నారని యజమాని వాపోయాడు. దీంతో నిర్వాహకులకు అసౌకర్యం కలగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల హాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు కొందరు వెనుకడుగు వేస్తుండటంతో గిరాకీ కూడా తగ్గిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను నివారించేందుకు ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

“పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష” అంటూ పెట్టిన ఈ బోర్డు స్థానికంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Sthanikam

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు

Article Image

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ యజమాని పెట్టిన బోర్డు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డులో “ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే 441 సెక్షన్ కింద చర్యలు.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో ఫంక్షన్ హాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండానే కొంతమంది వచ్చి భోజనం చేసి వెళ్లిపోతున్నారని యజమాని వాపోయాడు. దీంతో నిర్వాహకులకు అసౌకర్యం కలగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల హాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు కొందరు వెనుకడుగు వేస్తుండటంతో గిరాకీ కూడా తగ్గిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను నివారించేందుకు ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

“పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష” అంటూ పెట్టిన ఈ బోర్డు స్థానికంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News