Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:05 AM

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
01-03-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా తాపే పనివారుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ

పిల్లలమర్రి గ్రామంలో జిల్లా తాపే పనివారుల సంఘం తరఫున సూర్యాపేట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 10వ వార్డు కౌన్సిలర్ వెంకటి శేఖర్ రెడ్డి , 11వ వార్డు కౌన్సిలర్ వెలుగూరి ఇంద్ర వీరయ్య , 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు ని సంఘం నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. అదేవిధంగా పిల్లలమర్రి శివాలయం కమిటీ చైర్మన్ కొండ వెంకన్న , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి చంద్రశేఖర్ , ఆదిమల్ల కృష్ణ , బోళ్ల శేఖర్ రెడ్డి , చెరుకుపల్లి సైదులు , పాలడుగు శ్రీకాంత్ ని కూడా సంఘం తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. సన్మాన కమిటీ అధ్యక్షులు కొత్వాల రవి , ఉపాధ్యక్షులు బురుగుల శరత్, కార్యదర్శి చెరుకుపల్లి మధు, మాజీ అధ్యక్షులు చందుపట్ల రవి, సుతారి, తాపే సీనియర్ నాయకులు చింత మూత్తిలింగం, చెరుకుపల్లి శివ, చెరుకుపల్లి రవి, ఎస్.కె జానీమియా, పోకల కిరణ్, గంగాధరి జానయ్య, చెరుకుపల్లి ఎల్లయ్య, ఓరుగంటి రాములు, చింత ఎల్లయ్య, పోట్టపాక లక్ష్మణ్ రాముడు, ఇరుగు సైదులు నాగయ్య, నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరై నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

Sthanikam

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News