Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

07-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ వెక్కటి శేఖర్‌రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, గవ్వ ప్రతాప్‌రెడ్డి, చింతలచెర్వు పూర్ణయ్య, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్‌రెడ్డి, కనుకు వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News