Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు

పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు

పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు
02-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చారిత్రాత్మక 12వ శతాబ్దపు కాకతీయ కాలంనాటి పిల్లలమర్రి శివాలయాల్లో మంగళవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం శ్రీచక్ర దేవతకు మహిళా భక్తుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఆలయ అర్చకులు భక్తుల శ్రేయస్సు, లోకకల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి పారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగాయి. పిల్లలమర్రి చారిత్రాత్మక శివాలయ ప్రాంగణంలో శ్రీచక్ర దేవత సన్నిధిలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళా భక్తులు.

Sthanikam

పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News