Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:10 PM

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

18-02-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: కట్టా శేఖరరావు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు కట్టా శేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎలను వెంటనే విడుదల చేయాలని, సేవలో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలని, వేతన సవరణ సంఘం నివేదికను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఈర్ల కృష్ణను అభినందిస్తూ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈర్ల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర బాధ్యులు సాదే వెంకన్న, సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, శోభన్ బాబు, సర్వర్మియా, ఉపాధ్యాయులు నరేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News