Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:42 AM

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్
21-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించి అక్కడి నుంచే కేసులు నమోదు చేసే నూతన కార్యాచరణను సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది వారి నివాసానికి వెళ్లి పిర్యాదు స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.ముఖ్యంగా మహిళా పిర్యాదుల విషయంలో మహిళా పోలీస్ సిబ్బంది వెంటనే బాధితుల వద్దకు చేరుకుంటారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, మహిళలు, బాలలు, దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, భయాందోళనలతో బయటకు రాలేని వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

శారీరక దాడులు, అట్రాసిటీ చట్టం కింద కేసులు, గృహహింస, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేదింపులు వంటి కేసుల్లో ఈ విధానం ద్వారా బాధితులకు వెంటనే సహాయం అందుతుందని అన్నారు. ఈ నూతన ప్రణాళిక అమలుకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News