స్థానికం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌ను మాజీ కౌన్సిలర్ జిత్తు నాయక్‌తో పాటు ధరావత్ ధర్మ నాయక్, సైదా నాయక్, రంజిత్ నాయక్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనాడు కార్యాలయం సమీపంలో జరిగిన ఈ భేటీలో పరస్పర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా స్థానిక అంశాలు, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఫిషరీస్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు ప్రశంసించారు.ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి సమన్వయంతో ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి