Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్

26-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2011–12 నుంచి 2022–23 విద్యా సంవత్సరాల మధ్య చేరి, డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్ పరీక్షలను జూన్/జులై 2026లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు.

వారు మాట్లాడుతూ, బ్యాక్‌లాగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు రసీదును సమర్పించాలని తెలిపారు.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మార్చి 25, 2026 నుంచి ఏప్రిల్ 15, 2026 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కళాశాల నోటీసు బోర్డును పరిశీలించాలని సూచించారు.

Sthanikam

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్

Article Image

నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2011–12 నుంచి 2022–23 విద్యా సంవత్సరాల మధ్య చేరి, డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్ పరీక్షలను జూన్/జులై 2026లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు.

వారు మాట్లాడుతూ, బ్యాక్‌లాగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు రసీదును సమర్పించాలని తెలిపారు.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మార్చి 25, 2026 నుంచి ఏప్రిల్ 15, 2026 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కళాశాల నోటీసు బోర్డును పరిశీలించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News