Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం
12-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డబ్బు రెట్టింపు పేరుతో లక్ష్యంగా పెట్టిన మోసగాళ్లు

పల్నాడు ప్రతినిధి: సామాజిక మాధ్యమంలో వచ్చిన ప్రకటన నమ్మి ఓ మహిళ మోసపోయిన ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్లలో వెలుగుచూసింది. డబ్బు రెట్టింపు ఇస్తామని చెప్పిన ఆర్థిక సంస్థ మాటలను నమ్మి మహిళ యాభై వేల రూపాయలకు పైగా కోల్పోయింది. వివరాల ప్రకారం, ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఆసక్తి చూపిన మహిళ ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు నమ్మబలికారు. స్థానిక భారతీయ స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా మొత్తం 39,400 రూపాయలు జమ చేసింది. తరువాత ఇంకా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఫోన్ ద్వారా మరికొంత మొత్తం పంపింది.

ఇంట్లో విషయం తెలిసి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో మహిళ మోసపోయిన విషయం బయటపడింది. డబ్బు తిరిగి ఇవ్వాలని ఆ సంస్థను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆవేదన వ్యక్తం చేసింది. జాగ్రత్త అవసరం సామాజిక మాధ్యమాల్లో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పే ప్రకటనలు ఎక్కువగా మోసపూరితమేనని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ప్రకటనలు కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Sthanikam

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News