Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:01 AM

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

22-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సొంత తయారీతో 5 వేల డిజైన్లు – అందుబాటు ధరలతో ఆకట్టుకున్న ప్రదర్శన

సూర్యాపేట,

జిల్లా కేంద్రంలో కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సందడి చేసింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సొంత తయారీతో రూపొందించిన వేలాది డిజైన్ల ఆభరణాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆదివారం బాలాజీ గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను బిజినెస్ కోఆర్డినేటర్ ముస్త్యాల కిషన్, జనరల్ మేనేజర్ మిహెర్ షా, స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా అందమైన డిజైన్లలో జ్యువెలరీ తయారు చేసి అందుబాటు ధరల్లో అందించడం సంస్థ లక్ష్యమని తెలిపారు.

ఎగ్జిబిషన్‌లో డైమండ్, గోల్డ్, సిల్వర్ ఆభరణాలతో పాటు దేవతా విగ్రహాలు, కిరీటాలు కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సుమారు 5 వేల రకాల డిజైన్లతో అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వినియోగదారులు కోరుకున్న డిజైన్లలో ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేసి అందించే సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. సొంత తయారీ కావడంతో ధరలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కార్బన్ లక్స్ జ్యువెలరీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News