Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:35 PM

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యలీడేషన్ చట్టని రద్దు చేయాలి.. పాలవరపు సంతోష్

25-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలన్నారు ఈ పెన్షన్ విధానంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నరు. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ అనంతరం పొందే పెన్షన్ వారి జీవిత భద్రతకు గౌరవానికి ఆధారంగా ఉంటుందని అన్నారు, ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదని ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి ప్రత్యేక గుర్తింపు అని అన్నారు, పెన్షన్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుల వల్ల పెన్షన్ ఉద్యోగులలో గందరగోళాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయని అన్నారు, పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ దయానదం కు అందజేశారు ,ఈ ధర్నాకు మండల విశ్రాంతి ఉద్యోగులు తాళ్ల పెళ్లి యాదగిరి, కాసం మల్లయ్య, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దాసు, ఎండి జాన్, పాలకుర్తి ఎల్లయ్య, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మారెడ్డి, గునిగంటి సోమయ్య, ఉపేందర్, శ్రీరాములు, మాధవరావు, పులుసు పుల్లయ్య, పురుషోత్తం, మౌలానా, లలిత, తోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు.

Sthanikam

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యలీడేషన్ చట్టని రద్దు చేయాలి.. పాలవరపు సంతోష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News