Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:00 AM

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

13-04-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌ పెళ్లి పేరుతో యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. నకిలీ వివరాలతో పరిచయం పెంచుకుని కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

నగరానికి చెందిన పనస మధు (30) ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార సంస్థలో సాంకేతిక అధికారి‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకుని, మాటలతో నమ్మించి ఆమె కుటుంబాన్ని కలిశాడు.

తన ఉద్యోగాన్ని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డు చూపించడంతో యువతి కుటుంబం అతని మాటలను నమ్మింది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని గ్రహించిన మధు, తొలుత రెండు కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. అనంతరం చర్చల తర్వాత కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.ఇటీవల పెళ్లికి ముందు చిత్రీకరణ పేరుతో యువతిని నగరంలోని చైతన్యపురి ప్రాంతంలోని ఓ గదికి పిలిపించిన మధు, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మధు ఉద్యోగంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

Sthanikam

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News