Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:42 AM

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి

22-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మాజీ మంత్రి హరీష్ రావుకు బీసీ జేఏసీ వినతి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

హైదరాబాద్‌లో మాజీ మంత్రి టి. హరీష్ రావును బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో బీసీలకు, విద్యార్థులకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా చర్చించారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేసేలా కృషి చేయాలని భద్రబోయిన సైదులు కోరారు.విద్యార్థుల భవిష్యత్తుకు స్కాలర్‌షిప్‌లు కీలకమని, ఆలస్యం వల్ల విద్యాభ్యాసం అడ్డంకులకు గురవుతోందని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించేందుకు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి

Article Image

మాజీ మంత్రి హరీష్ రావుకు బీసీ జేఏసీ వినతి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

హైదరాబాద్‌లో మాజీ మంత్రి టి. హరీష్ రావును బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో బీసీలకు, విద్యార్థులకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా చర్చించారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేసేలా కృషి చేయాలని భద్రబోయిన సైదులు కోరారు.విద్యార్థుల భవిష్యత్తుకు స్కాలర్‌షిప్‌లు కీలకమని, ఆలస్యం వల్ల విద్యాభ్యాసం అడ్డంకులకు గురవుతోందని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించేందుకు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News