Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి

26-02-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.చౌటుప్పల్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన ఎఫ్‌సీ చర్లగూడెం రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేస్తే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన అనేక గ్రామాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.

ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, త్రాగునీటిని కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. రాబోయే బడ్జెట్‌లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సరిపడా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా మంత్రులు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. గతంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించామని, అవసరమైతే మళ్లీ ప్రజా పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే వరకు విడతల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు యానాల దామోదర్ రెడ్డి, కురిమిద్దె శ్రీనివాస్, పల్లె శేఖర్ రెడ్డి, పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, పొట్ట శంకరయ్య, రొండి నర్సింహా, టంగుటూరి రాములు, నర్సింహా, భాస్కర్, దాసరి మనోహర్, బోయ మంకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News