Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:56 AM

పేదలకు పెన్నిధిగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు పెన్నిధిగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు పెన్నిధిగా ముఖ్యమంత్రి సహాయ నిధి
20-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

65 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షలకుపైగా ఆర్థిక సాయం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఆరోగ్య సమస్యలతో, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద దిక్కుగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 65 మంది పేద కుటుంబాల లబ్ధిదారులకు మొత్తం రూ.25 లక్షల 39 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారం అందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు సకాలంలో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది మంది పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. అందిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, ఛివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, పిసిసి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వేములకొండ పద్మ, గుణగంటి వంశీధర్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు పెన్నిధిగా ముఖ్యమంత్రి సహాయ నిధి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News