Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:42 AM

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు

01-06-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంలో చేగోని సులోచన–అంజయ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దండి రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు మొరిశెట్టి నివేదిత లక్షాదితో కలిసి మాట్లాడారు.

ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను నిరాశపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో ఇళ్లను మంజూరు చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాద ఉపేంద్ర యాదగిరి, ఉప సర్పంచ్ ఇరుగు విజిత, గ్రామ శాఖ అధ్యక్షుడు గొడదటి వెంకన్న, మాజీ సర్పంచ్ మాద లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి, చివ్వేంల మండల అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, గుంజలూరు సర్పంచ్ బొల్లికొండ సైదులు, కేసారం సర్పంచ్ రేఖ రమణ సతీష్, జాతోత్ తండ సర్పంచ్ నగేష్ నాయక్, జిల్లా నాయకులు గుణగంటి సతీష్, మాలి ఆనంతరెడ్డి నాగు నాయక్, మద్దెబోయిన శ్రీనివాస్, పడిదల రవి, నరేందర్ నాయుడు, నారాయణ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News