Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:57 AM

పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం

పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం

పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం
27-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ వైఖరి మారకపోతే ప్రజలే పీటలు కదిలిస్తారు – జూలకంటి రంగారెడ్డి

కూల్చిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి… నిరాశ్రయులకు నష్టపరిహారం ఇవ్వాలి

పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల ఆధీనంలో ఉన్న ఇళ్లను కూల్చడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో గత పది సంవత్సరాలుగా భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న పేదలపై రెవిన్యూ యంత్రాంగం, పోలీసు బలగాలు దాడి చేసి ఇళ్లను కూల్చడం అన్యాయమని పేర్కొన్నారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ వైఖరి మారకపోతే రాష్ట్ర ప్రభుత్వ పీటలు ప్రజలే కదిలిస్తారని హెచ్చరించారు. కూల్చిన ఇళ్ల స్థానంలో పేదలకు పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడుల కారణంగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఎరువుల పంపిణీ సంఘాల ద్వారా చేయాలని, రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా దళిత, గిరిజన తండాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News