Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:59 AM

పెద్దమంతూరు జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ దినోత్సవం

28-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం లోని పెద్దమంతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నూతన వర్కింగ్ మోడల్స్ రూపొందించి ప్రదర్శనకు ఉంచగా, మానవ అవయవాల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రించి రంగులు వేసి ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.

పెద్దమంతూరు క్లస్టర్ పరిధిలోని చిన్నమంతూరు, తిమ్మాపురం, చెరుకూరు, రోప్పాల, శేషాపురం, కలిపి, కలిపి కాలనీ మరియు పెద్దమంతూరు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి రొద్దం మండల టిడిపి కన్వీనర్ నరహరి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు హాజరై ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. విచ్చేసిన విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ పుల్లారాయుడు మరియు రాఘవేంద్రలను ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

పెద్దమంతూరు జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News