Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కు డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరు గణేష్

23-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామపంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతంరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ డిమాండ్ చేశారు.

గ్రామంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి రామన్నపేట రోడ్డువరకు ఇరువైపులా 2011 సంవత్సరంలో నాటిన వేప చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తొలగించి ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశారని ఆయన ఆరోపించారు. గ్రామానికి నీడనిచ్చే విధంగా, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా పెద్ద వృక్షాలుగా ఎదిగిన ఈ చెట్ల విలువ సుమారు రూ.5 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.

గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, ఆర్ అండ్ బి అధికారులు, అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే కార్యదర్శి తన సొంత నిర్ణయంతో చెట్లను విక్రయించడం తీవ్రమైన నేరమని గణేష్ మాదిగ అన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన చర్యగా ఆయన విమర్శించారు.

ఒకవైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కల నాటే కార్యక్రమాలు చేపడుతుంటే, ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి వ్యక్తిగత లాభం కోసం చెట్లను నరికివేయడం బాధాకరమని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ ఇంతటితో వదిలిపెట్టబోదని స్పష్టం చేసిన గణేష్ మాదిగ, అవసరమైతే ఆర్ అండ్ బి అధికారులు, అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. పర్యావరణానికి నష్టం కలిగించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కు డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరు గణేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News