Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

పీఆర్‌సీ, డీఏలపై గెజిటెడ్ అధికారుల డిమాండ్

18-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వచ్చిన వార్తల ప్రభావంతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందడి ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నుండి అమలు కావాల్సిన పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఏప్రిల్ 1, 2026 నుండి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల్లో ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి అర్హులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జిల్లా అధ్యక్షుడు సి. జగన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధికి సమీపంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

జిల్లా కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాస్ పదోన్నతి పొందిన సందర్భంగా కార్యవర్గం తరఫున సన్మానం చేశారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పీఆర్‌సీ, డీఏలపై గెజిటెడ్ అధికారుల డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News