Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

22-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

మండల పర్యటనలో భాగంగా ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ఆయన మరమ్మతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. అనంతరం జనంపల్లి రెసిడెన్షియల్ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎంపీఓ రాహుఫ్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

రామన్నపేట

పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

మండల పర్యటనలో భాగంగా ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ఆయన మరమ్మతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. అనంతరం జనంపల్లి రెసిడెన్షియల్ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎంపీఓ రాహుఫ్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News