Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

01-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | జహీరాబాద్ రూరల్ సీఐ పరిధి

తేదీ: 01-02-2026

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 27-01-2026 నాడు సంగారెడ్డి జిల్లా కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పలకు చెందిన ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదు దొంగలించి పరారైనట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు హద్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారి ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి, కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 నాడు ఉదయం గంగ్వార్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ అతివేగంగా వచ్చి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకొని విచారించగా, తాను చోరీ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుండి

రెండున్నర తులాల బంగారు ఆభరణాలు,

రూ.1,000 నగదు,

చోరీకి ఉపయోగించిన ఆటో వాహనం

స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారితో పాటు సిబ్బంది

సేవాలాల్, అభినేర్, తమ్మాలి రాజశేఖర్, సాయి కిరణ్, మహేష్ బాబు, పాండులను

సీఐ జక్కుల హన్మంతు గారు అభినందించారు.

రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి

Sthanikam

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News