Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు

01-05-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధిక శబ్దాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా తనిఖీలు చేపట్టి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న 07 మంది వాహనదారులను గుర్తించి మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే ఆయా వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనదారులను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Sthanikam

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News