Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:53 PM

పశు ఔషధ బ్యాంక్ కోదాడ కు మరో అరుదైన విరాళం

27-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పశు ఔషధ బ్యాంక్ కోదాడ కు మరో అరుదైన విరాళం

“సర్వేంద్రియాన్ నయనం ప్రధానం “ అన్నారు పెద్దలు, జంతువుల్లో అయితే ఈ నయనాలు మరింత ప్రధానం.నేత్రాలు లేని పశువుల ప్రాణాలకు ఆ క్షణమే విలువ లేకుండా పోతుంది. అలాంటి ముఖ్యమైన జంతు నేత్రాల ఆరోగ్య పరిరక్షణకు, నేత్ర శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాల లోటు ఉన్నప్పటికీ కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ఈ మధ్య గోండ్రియాల గ్రామ పశుపోషకుని గేదెకి కంటిలో పెరిగిన భారీ కణితిని తొలగించిన విషయం గుర్తించిన నీటిపారుదల శాఖ , కోదాడ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి భవిష్యత్ లో పశు నేత్ర చికిత్సలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సదాశివం తో డిల్లీ నుండి ఇన్ డైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ పరికరాన్ని కొనుగోలు చేసి పశు ఔషధ బ్యాంక్ కోదాడ కి విరాళంగా అందించారు.

జిల్లాలే కాక రాష్ట్రాలు దాటి ఎక్కడెక్కడినుండో వస్తున్న మూగ జీవాలకు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అందిస్తున్న వైద్యసేవలకు అబ్బురపడి అత్యవసరమైన ఔషధాలను 5 వేల చొప్పున తన వేతనం నుండి ప్రతీ నెలా శాశ్వతంగా అందిస్తామని ముందుకు రావడం అత్యంత అభినందనీయమని వెంకటలక్ష్మారెడ్డి బహూకరించిన ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ ని కోదాడ లో ప్రారంబించి ,వారి దాతృత్వాన్ని కొనియాడిన జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా. డి శ్రీనివాసరావు.

అనంతరం ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న చికిత్సలు, రోడ్డు ప్రమాదంలో తలకి బైక్ తగిలి రక్తంకోల్పోయి బిగదీసుకుపోయిన 20 రోజుల కుక్కపిల్లకి ఇతర కుక్కల నుండి సేకరించిన రక్తాన్ని ఎక్కించి ప్రాణాల్ని రక్షించడం, మేళ్లచెర్వు మండలం లో చనిపోయిన గొర్రెపిల్లను తీసుకురాగా నిర్వహించిన పోస్ట్ మార్టం ఆసాంతం పరిశీలించారు . అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య తెలిపిన పోస్ట్ మార్టం వివరాల ప్రకారం గొర్రె పిల్లలను పత్తి చేలో మేపడం వలన పురుగు మందుల అవశేషాల విష ప్రభావం తో గొర్రె పిల్లలు మృత్యు వాతపాడుతున్నాయని, పెద్ద గొర్రెలు ఎదిగిన అరల పొట్ట వలన కొంత వరకు అవి తట్టుకొని వెంటనే లక్షణాలు కనిపించవు కానీ చిన్న పిల్లలు విషప్రభావానికి త్వరగా గురై మరణిస్తాయని జీవాల పెంపకం దారులు తమ జీవాలను పత్తి చేలల్లో మేపరాదని సూచించారు.

జిల్లాలో వినూత్నమైన పశువైద్యసేవలతో మూగజీవాలను రక్షిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ సేవలు అత్యంత ప్రశంసనీయమని అభినందించారు.

కార్యక్రమంలో సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు

Sthanikam

పశు ఔషధ బ్యాంక్ కోదాడ కు మరో అరుదైన విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News