Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

పార్టీలకు అతీతంగా ముస్లిం దర్గాలను అభివృద్ధి చేస్తాం: ఎంపీ కేశినేని. శివనాద్ (చిన్ని)

పార్టీలకు అతీతంగా ముస్లిం దర్గాలను అభివృద్ధి చేస్తాం: ఎంపీ కేశినేని. శివనాద్ (చిన్ని)

పార్టీలకు అతీతంగా ముస్లిం దర్గాలను అభివృద్ధి చేస్తాం: ఎంపీ కేశినేని. శివనాద్ (చిన్ని)
January 16, 2026 05:05 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్


విజయవాడ :కుమ్మ‌రి పాలెం లో షాదీఖానా, ఈద్గా గ్రౌండ్, బ‌రియ‌ల్ గ్రౌండ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని. శివనాథ్ మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ పశ్చిమ నియోజకవర్గం కుమ్మ‌రి పాలెం గుప్తా సెంట‌ర్ లోని షాదీ ఖానా, ఈద్గా ప్రాంగ‌ణం, బ‌రియ‌ల్ గ్రౌండ్ ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుక్రవారం ప‌రిశీలించారు. మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ ఆహ్వానం మేర‌కు టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా తో క‌లిసి పరిశీలనకు వచ్చిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి ఈద్గా కమిటీ సభ్యులు కుమ్మరిపాలెం వద్ద గల ముస్లింల బరియల్ గ్రౌండ్, మస్జిద్-ఎ-మదీనా, ఈద్గా మరియు షాదీ ఖానా సమస్యలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బరియల్ గ్రౌండ్ చాలా పల్లంగా ఉండటంతో, అక్కడ ఖననం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచి మరింత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కావున బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎర్రమట్టి పూడిక, సిమెంటు రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం ఉన్న షాదీ ఖానాల్లో ఈ షాదీఖానా ఒకటని, దీనిని 2000వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించారని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీని అభివృద్ధిపై తగిన దృష్టి సారించలేదని విన్నవించారు. ఈ షాదీ ఖానాను మస్జిద్-ఎ-మదీనా కమిటీ సంరక్షణలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సహకారం అందించాలని ప్రాంత ముస్లిం ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఈద్గా, షాదీ ఖానాల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డుతో చర్చించి నిధుల సమీకరణ చేస్తామని, అవసరమైన మేరకు ఎంపీ నిధుల నుంచి కూడా కేటాయింపులు చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని మసీదుల కమిటీలను సమన్వయం చేసుకొని, రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు.అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటన సందర్భంగా ఇక్కడ గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నందున, తప్పకుండా వారి విజ్ఞప్తి మేరకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తనపై అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నట్లు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. సొంత డబ్బులతో గత 25 ఏళ్లుగా ఇక్కడి ముస్లింల ఆధ్వర్యంలో ప‌లు కార్యక్రమాలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ స‌భ్యులు స‌య్య‌ద్ హుస్సెన్, బాబు, షేక్ బ‌షీర్, యూసుఫ్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు త‌మీమ్ అన్సార్, తెలుగు దేశం పార్టీ నాయ‌కులు క‌రీముల్లా, సుబానీ, స‌త్తార్, అజీజ్ ల‌తో పాటు ఇత‌ర క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News