Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:50 AM

పరిశుభ్ర చౌటుప్పల్ దిశగా అడుగులు… డంపింగ్ యార్డు వద్ద కమిషనర్, పాలకవర్గం పరిశీలన

పరిశుభ్ర చౌటుప్పల్ దిశగా అడుగులు… డంపింగ్ యార్డు వద్ద కమిషనర్, పాలకవర్గం పరిశీలన

పరిశుభ్ర చౌటుప్పల్ దిశగా అడుగులు… డంపింగ్ యార్డు వద్ద కమిషనర్, పాలకవర్గం పరిశీలన
February 20, 2026 09:35 PM 257 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించడమే లక్ష్యంగా చౌటుప్పల్ మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గోల్డెన్ ఫారెస్ట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డు ను మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొసనం రాకేష్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్ తదితరులు సందర్శించారు.

బయో మైనింగ్ ప్రక్రియపై అవగాహన

రోజుకు 150 టన్నుల వరకు శుద్ధి

గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పాత వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి భూమిని పునరుద్ధరించే బయో మైనింగ్ ప్రక్రియను కమిషనర్ వివరించారు. ప్లాంట్ ద్వారా చెత్తను మూడు రకాలుగా వేరు చేసి, పర్యావరణానికి హాని కలగకుండా ఎలా నిర్మూలిస్తారో కౌన్సిల్ సభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు. రోజుకు సుమారు 150 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

తడి–పొడి చెత్త వేరు సేకరణపై ఆదేశాలు

తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని పేర్కొంటూ, ఇళ్ల నుంచి తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని కమిషనర్ అధికారులకు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఆదేశించారు.

డి ఆర్ సి సి అవసరం – లింగోజిగూడెంలో ప్రతిపాదనలు

పొడి చెత్త సేకరణ, రీసైక్లింగ్ కోసం ఏర్పాటు అత్యవసరమని ఈ సందర్భంగా తెలిపారు. లింగోజిగూడెంలో కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, అనుమతులతో త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

ప్లాస్టిక్, గాజు, ఇనుము వంటి పునర్వినియోగ వస్తువులను వేరు చేయడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం రావడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, “మున్సిపాలిటీ పరిశుభ్రతలో ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఆధునిక వ్యర్థ నిర్వహణ పద్ధతులతో చౌటుప్పల్‌ను ఆదర్శంగా నిలుపుతాం,” అన్నారు.వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ,పాలకవర్గం–అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.మొదటి వార్డ్ కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, తడి చెత్తతో బయోగ్యాస్ ప్లాంట్, పనికిరాని ప్లాస్టిక్‌తో బయో పెట్రోల్ తయారీ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, బయో మైనింగ్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News