Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

పర్యావరణంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

27-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు నిర్వహించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సహకారంతో చేపట్టిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు సూర్యాపేట జిల్లా చివ్వెంల సమీప

ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ స్వయంగా అభివృద్ధి చేసిన ఈ అడవి విద్యార్థులను ఆకట్టుకుంది. తన సొంత 70 ఎకరాల భూమిని అడవిగా మార్చిన ఆయన సేవలను కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం ప్రశంసించారు. ప్రకృతిపట్ల ఉన్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.

సందర్శనలో భాగంగా విద్యార్థులు చెట్లు, మొక్కలు, జీవవైవిధ్యం సహజసిద్ధంగా ఎలా అభివృద్ధి చెందుతాయో ప్రత్యక్షంగా గమనించారు. ప్రకృతి మనిషి జీవనానికి ఎంత ముఖ్యమో అవగాహన పొందారు. జగదీశ్ ఈ సందర్భంగా మార్గదర్శకత్వం అందించారు.

అనంతరం సూర్యాపేట మున్సిపాలిటీ కమిటీ హాల్‌లో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ నిపుణుడు సాయి ప్రసాద్ తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, వర్మి కంపోస్ట్, ఇటుకల తయారీపై ప్రదర్శన ఇచ్చి విద్యార్థులకు స్పష్టతనిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, ఆంజనేయులు, అమర్, నరేష్, రాధిక, రవి, అధ్యాపకేతర సిబ్బంది షరీఫ్, ఆంజనేయులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News