Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:59 PM

పర్యావరణ సేవలకు ఘన గుర్తింపు.. ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి సన్మానం

02-06-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) మరియు తెలంగాణ జాతీయ హరిత దళం (ఎన్‌జీసీ) సంగారెడ్డి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్వహించిన వేసవి శిబిరాలలో విశిష్ట సేవలందించిన ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన శిబిరాల్లో నాటికలు, గల్పికలు, నృత్యాలు, పర్యావరణ చైతన్య కార్యక్రమాలు నిర్వహించి విశేష సేవలందించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెల్లాపూర్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్ ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివంపేట ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జ్ విద్యాధికారి శంకర్, జాతీయ హరిత దళం జిల్లా కో-ఆర్డినేటర్ మాధవ రెడ్డి, జిల్లా నోడల్ అధికారి లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి, పీసీబీ అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ సేవలకు ఘన గుర్తింపు.. ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News