Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

ప్రాంతీయ పశువైద్యశాలకి బహుళార్థక ఎండోస్కోప్ పంపిణీ

24-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆధునిక సాంకేతిక యంత్రాలతో ఇంకా మెరుగైన పశువైద్య సేవలు

- డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

మారుతున్న కాలానుగుణ అవసరాల కనుకూలంగా మారుమూల గ్రామాల్లో జంతువైద్యంలో సైతం శాస్త్రీయ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ చేయడానికి బహుళార్డ ఎండోస్కోప్ లు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు .

జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా.డి.శ్రీనివాసరావు చేతుల మీదుగా సూర్యాపేట లో బహుళార్డ ఎండోస్కోప్ స్వీకరించిన సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ పాడి పశువుల్లో అతిగా ఇబ్బంది పెట్టే గర్భధారణ సమస్యలు పరిష్కరించడానికి ఈ ఎండీస్కాప్ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒక పశువు సమస్యలను అధిగమించి ఒక నెలరోజుల ముందు సూడి మోసినా నెలకి పదివేల రూపాయల అదనపు ఆదాయం రైతుకి లభిస్తుందని, అదే పట్టణంలో ఉన్న 5 వేల పశువుల్లో ఈ యంత్రం వాడకం ద్వారా సకాలంలో రెండు వేల పశువులు ఒక్క నెల ముందు సూడి మోసినా నెలకి రెండు కోట్ల అదనపు సంపద వస్తుందని తెలిపారు.

కుక్కలు, పిల్లులు,గొర్రెలు మేకలు ఆవులు గేదెల్లో గొంతు లో మేత కానీ ఇతర పదార్ధాలు అడ్డు పడినప్పుడు, గొంతు సమస్యలను గుర్తించడానికి ఈ ఎండోస్కోప్ ఎంతో ఉపకరిస్తుందని ఈ పరికరం సహాయం తో గొంతులో అడ్డుగా ఉన్న వాటిని గుర్తించి సత్వరమే శస్త్ర చికిత్సతో తొలగించి జంతువుల ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు.

ఈ బహుళార్థక ఎండోస్కోప్ , మరియు మొబైల్ మానిటరింగ్ గల కిట్స్ జిల్లాలోని అన్ని పశువైద్య శాలల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుందని , పశుపోషకులకు ఇకనుండి మెరుగైన వ్యాధినిర్ధారణతో సమర్థ వైద్యసేవలు అందిస్తామని తెలిపారు

ఎండోస్కాప్ పంపిణీ కార్యక్రమములో జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ డా బి వెంకన్న, తుంగతుర్తి, నేరేడుచర్ల అసిస్టెంట్ డైరెక్టర్ లు డా సత్యనారాయణ, బి. రవిప్రసాద్ పాల్గొన్నారు.

Sthanikam

ప్రాంతీయ పశువైద్యశాలకి బహుళార్థక ఎండోస్కోప్ పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News