Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 01:20 AM

పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి

27-05-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అన్ని మండలాల నాయకులతో విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, మహిళలు, కొత్త ఓటర్లను అధిక సంఖ్యలో పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ ఆన్‌లైన్ విధానంలో కూడా నమోదు చేసే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి నాయకుడికి సభ్యత్వ నమోదు లక్ష్యాలు కేటాయించి గ్రామ, బూత్ స్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం, సభ్యత్వ నమోదు పనితీరు ఆధారంగా భవిష్యత్ బాధ్యతలు అప్పగించడం, కార్యకర్తల సంక్షేమం కోసం బీమా వంటి పథకాలపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీని మళ్లీ ప్రజల్లో బలంగా నిలబెట్టేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనుముల మారుతి, ప్రభాకర్, గంగారం, పండరి యాదవ్, అంజయ్య సాగర్, విజయ్, కృష్ణారెడ్డి, శంకర్ సాగర్, నారాయణ సాగర్, బసవరాజు పటేల్, సంగారెడ్డి, కర్ణం రాజు, నరసింహులు, ఆకుల రాములు, రామాగౌడ్, ప్రహ్లాద్, సంతోష్ పటేల్, సాయిలు, సందీప్, నమిల్ల హన్మండ్లు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News